చెన్నూర్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ అధ్యక్షతన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, రోడ్లు భవనాలు, దేవా దాయ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది టైర్‌వన్ గోదావరి ఘాట్లలో చెన్నూర్ ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు. చెన్నూర్‌కు నలువైపుల రోడ్డు సౌకర్యం పెరగడంతో రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, రోడ్లు, పార్కింగ్, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వానికి నివేదిస్తామని అ న్నారు. అనంతరం నది సమీలోని పుష్కర ఘా ట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో మున్సి పల్ కమిషనర్ మురళీకృష్ణ, సీఐ బన్సీలాల్, డీటీ సనత్‌కుమార్, హైదరాబాద్ ఫ్లై ఏజెన్సీ అధికారి అనిరుధ్, వైస్ చైర్మన్ వినయ్‌కుమార్, కౌన్సిలర్లు అంబటి శంకర్, శివకృష్ణ, కాంగ్రెస్ నాయకులు గొడిసెల బాపురెడ్డి, పెద్దింటి శ్రీనివాస్ పాల్గొన్నారు.


