రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

Apr 2 2026 8:34 AM | Updated on Apr 2 2026 8:34 AM

మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. అరైవ్‌–అలైవ్‌ మూడో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఏసీసీ సమీపంలో రహదారిపై వాహనాల తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసుల రికార్డులు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్‌, సీఐ ప్రమోద్‌రావు, ట్రాఫిక్‌ సీఐ వేణుచందర్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement