ఆదర్శం.. జైపూర్ కేజీబీవీ
జైపూర్: గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు కస్తూర్భాగాంధీ విద్యాలయాలు (కేజీబీవీ) వరంగా మారా యి. నిరుపేద బాలికలకు నాణ్యమైన విద్యతో పా టు వసతి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం స్థాపించిన కేజీబీవీలు ప్రైవేట్ కళాశాలలకు దీటుగా విద్యనందిస్తున్నాయి. దీంతో విద్యార్థినులు ఉత్తమ ఫలి తాలు సాధిస్తున్నారు. 2014లో ప్రారంభమైన కేజీ బీవీల్లో ప్రారంభ దశ నుంచే విద్యార్థినులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నారు. చక్కటి వాతావరణంలో ఒకేచో ట తరగతి గదులు, వసతి కల్పించడంతో విద్యార్థి నులు కేజీబీవీల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నా రు. ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరిగిపోయింది. ని ర్ణీత సీట్లకు మించి కొన్ని తరగతుల్లో ప్రవేశాలుండ డం ఇందుకు నిదర్శనం. జైపూర్ మండల కేంద్రంలో ఎడ్యుకేషన్ కారిడార్‌గా మంచిర్యాల–చెన్నూర్ 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఒకేచోట గురుకులం, దానికి ముందుగా ప్రభుత్వ కళాశాల, దాని పక్కనే కస్తూర్భాగాంధీ విద్యాలయం ఏర్పా టు చేశారు. దీనికి తోటు ఇప్పుడున్న భవనం ముందు తరగతి గదుల కోసం రూ.2.30కోట్లతో కొత్త భ వనం నిర్మించగా వినియోగంలోకి తీసుకువచ్చారు. దీంతో జైపూర్ కస్తూర్భాగాంధీ విద్యాలయంలో ప్రవేశాలకు మరింత డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు 398మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలతో మెనూ ప్రకారం విద్యార్థినులకు ఉదయం టిఫిన్, నాణ్య మైన మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, మళ్లీ రాత్రికి భోజనం అందిస్తున్నారు.
పరీక్షల్లో మెరుగైన ఫలితాలు
జైపూర్ కేజీబీవీలో ఇంటర్, టెన్త్‌లో విద్యార్థినులు మూడేళ్లుగా వరుసగా వందశాతం ఫలితాలు సా ధి స్తూ శభాష్ అనిపించకుంటున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థినులకు సులభతరంగా, అర్థయ్యేలా వి ద్యాబోధన చేస్తున్నారు. వారిలో నైపుణ్యాన్ని వెలికితీసేలా చక్కటి బోధనతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గడిచిన విద్యాసంవత్సరంలో టెన్త్‌లో 529 మార్కులతో కేజీబీవీ విద్యార్థిని మండల టాపర్‌గా నిలిచింది. ఎంపీసీ ఫస్టియర్‌లో ఇద్దరు విద్యార్థినులు 470మార్కులకు 462మార్కులు సాధించారు. మరో విద్యార్థిని బైపీసీలో 440మార్కులకు 426 మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 1000మార్కులకు 962మార్కులు సాధించగా బైపీసీలో 1000మార్కులకు 962మార్కులు సాధించి జిల్లాలోనే జైపూర్ కస్తూర్బా విద్యాలయా నికి మంచి గుర్తింపు తీసుకువచ్చారు.


