వర్షాలే దెబ్బతీసినయ్
ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో రెండున్నర ఎకరాల పత్తి చేనులో ఇసుక మేటలు వేసినయ్. వ్యవసాయాధికారులు వచ్చి రాసుకపోయిండ్రు. పంటల బీమా లేదు. ప్రభుత్వ సాయం అందలేదు. పెట్టుబడి కూడా రాలేదు. మొత్తానికి వర్షాలే మమ్మల్ని దెబ్బ తీసినయ్.
– అరుణ్‌సింగ్, నెన్నెల
పెట్టుబడి పైసలూ రాలే
నేను ఎనిమిదెకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో వరి సాగు చేసిన. ప త్తి ఎకరానికి 10 క్వింటాళ్ల పైన దిగుబడి రావాల్సి ఉండగా ఐదు నుంచి ఆరు క్వింటాళ్లకు మించలే. ఎకరాకు 60 బస్తాల వడ్లు రావాల్సి ఉండగా 30 నుంచి 35 బస్తాలు దాటలే. కౌలు పైసలు, పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు.
– తని శంకర్, కుందారం, జైపూర్ మండలం


