అయ్యప్ప సన్నిధిలో మంత్రి ‘అడ్లూరి’
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీఅభినవ శబరి మలై అయ్యప్ప ఆలయంలో శనివారం మహా మండల పడిపూజను వైభవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూరి లక్ష్మణ్‌కుమార్, తన కుమారుడు హరీశ్వర్‌తో హాజరయ్యారు. వారు అయ్యప్ప దీక్షతో, పడిపూజ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ వ్యవస్థాపక గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు స్వాగతం పలికారు. అనంతరం పడిపూజలో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో గల పదునెట్టాంబడిపై పూజలు చేశారు. నిత్యం వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి పడిపూజ పూర్తయ్యేదాకా అయ్యప్ప సన్నిధిలో గడిపారు. పూజ, భజన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అనంతరం ఆల యం వద్ద ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల భిక్ష స్వీకరించారు. పడిపూజకు జిల్లాతో పాటు జగిత్యా ల, కరీంనగర్ జిల్లాల నుంచి అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు.


