అటవీ ప్రాంతంలో వ్యర్థాలను ఏరివేయాలి
శ్రీరాంపూర్: సింగరేణి అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా ఏరివేయాలని సింగరేణి ఫారెస్ట్ అడ్వైజర్ పరిగెన్ సూచించారు. శనివారం ఆయన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని ఓబీ డంప్‌యార్డు ప్రాంతాన్ని, చుట్టూ ఉన్న సింగరేణి ఫారెస్ట్ భూములను పరిశీలించారు. ఇటీవల ఈ ప్రాంతంలో పులి సంచరించిన ప్రాంతాలను సందర్శించారు. వన్యప్రాణులకు కావాల్సిన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇందుకోసం కంపెనీ తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను ఆయన అధికారులకు సూచించారు. ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, మంచిర్యాల ఎఫ్‌డీవో సర్వేశ్వర్ ఆయన వెంట ఉన్నారు. పులి కదలికలపై సింగరేణి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని, దానికి ఎలాంటి హాని కలగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని జీఎం వారికి వివరించారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి చిప్ప వెంకటేశ్వర్లు, డీజీఎం (ఫారెస్ట్) హరినారాయణ, సర్వే అధికారి సంపత్, ఫారెస్ట్ అధికారి రత్నాకర్ పాల్గొన్నారు.


