పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
నెన్నెల/మందమర్రిరూరల్: యాసంగిలో సాగు చేసే పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ రైతులకు సూచించారు. మంగళవారం రైతు దినో త్సవం సందర్భంగా నెన్నెల, మందమర్రి మండల కేంద్రాల్లోని రైతువేదికల్లో ఏర్పాటు చేసిన రైతునేస్తం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్‌పై వివరించారు. వరి కొయ్యలను కాల్చవద్దని, భూమి సారం కోల్పోతుందని అన్నారు. ఆయిల్‌ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని, మన భూములు ఆయిల్ ఫా మ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని తెలి పారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయాధికారి సృజన హార్టికల్చర్ ఆఫీసర్ అరుణ్, ఏఈఓ రాంచందర్, శాస్త్రవేత్తలు మహేష్, సాధ్వి, ఏఈవో తిరుపతి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


