పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి
కాసిపేట: పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్‌రావు తెలిపారు. మంగళవారం మండలంలోని గట్రావ్‌పల్లి గ్రామ పంచాయతీ సాలేగూడలో బెల్లంపల్లికి చెందిన ఫార్మర్ ప్రొడ్యుసర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్‌ఫెస్టివల్(ఆహార పండుగ)లో ఆయన మాట్లాడారు. అడవి ఆకు కూరలను పునరుద్ధరించడం, సంరక్షించడం, వాటి ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఏ ప్రతినిధి డాక్టర్ రాజశేఖర్, న్యూట్రీషన్ స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష, ఎఫ్‌పీఓ చైర్మన్ అండ్ డైరెక్టర్లు ఎంబడి కిషన్, సర్పంచ్ ఆత్రం గంగుబాయి, మాజీ సర్పంచ్ పేంద్రం రాజు తదితరులు పాల్గొన్నారు.


