లక్ష్యాలను సాధిస్తేనే అభివృద్ధి ఫలాలు
శ్రీరాంపూర్: కంపెనీ నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తేనే సంస్థ అభివృద్ధి సాధించి ఫలాలు పొందుతామని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జీఎం కార్యాలయం వద్ద సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కంపెనీ 72మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుందని, సాధనకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటికి 78శాతం ఉత్పత్తి సాధించామని, మిగిలిన రోజుల్లో లోటును భర్తీ చేస్తూ లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని తెలిపారు. ఏరియాలో ఇద్దరు ఉత్తమ ఉద్యోగులు, ఇద్దరు ఉత్తమ అధికారులను జీఎం సన్మానించి బహుమతి అందజేశారు. ఇతర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించారు. ఇటీవల నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు, కార్మికుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో క్వాలిటీ జీఎం వీరభద్రరావు, ఏరియా సేవా అధ్యక్షులు ఉమారాణి, ఏరియా ఎస్‌ఓటు జీఎం యన్.సత్యనారాయణ, డీజీఎం(పర్సనల్) అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
దేశంలోని బొగ్గు గనులకు దీటుగా సింగరేణి
మందమర్రిరూరల్: దేశంలోని బోగ్గు గనులకు దీటుగా సింగరేణి సంస్థ నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ పోటీ పడుతోందని ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. మంగళవారం ఏరియాలోని జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సింగరేణి వేడుకల్లో ఏరియా సేవాసమితి అధ్యక్షురాలు, ఆయన సతీమణి శ్రీవాణితో కలిసి జెండా ఎగురవేశారు. అనంతరం ఏరియా ఉత్తమ అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దేవాపూర్ ఉద్దంసింగ్ గురువు ఆధ్వర్యంలో చిన్నారుల కలరీ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్వో టు జీఎం లలితేంద్రప్రసాద్, డీజీఎం(పర్సనల్) అశోక్, సీనియర్ పీవో బొంగోని శంకర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూశంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినుల నృత్య ప్రదర్శన
కలరీ ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులు
లక్ష్యాలను సాధిస్తేనే అభివృద్ధి ఫలాలు
లక్ష్యాలను సాధిస్తేనే అభివృద్ధి ఫలాలు


