ఘనంగా క్రిస్మస్
– 9లోu
ఎమ్మెల్యేల చేతిలో సహకార సంఘాల్లో ‘ఎంపిక’
ఎన్నికలు లేకుండా ముగ్గురితో కమిటీల ఏర్పాటు
నేరుగా చైర్మన్, సభ్యులను నియమించే అవకాశం
అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పదవులపై ఆశలు
మంచిర్యాలటౌన్: సీఎస్‌ఐ చర్చి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, నాయకులు
చెన్నూర్‌రూరల్: కిష్టంపేటలోని చర్చిలో చిన్నారులు
లక్సెట్టిపేట: చిన్నారులతో కలిసి కేక్ కట్ చేస్తున్న డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ
క్రిస్మస్ పండుగ సందర్భంగా వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చెన్నూర్‌లో రాష్ట్ర మంత్రి వివేక్, కలెక్టర్ కుమార్ దీపక్ కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్‌ఎస్ నాయకులు, డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ తదితరులు వేర్వేరు ప్రాంతాల్లో వేడుకల్లో పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు ఎన్నికలు నిర్వహించకుండా నాన్ ఆఫీషియల్ పద్ధతిలో త్రీమెన్ కమిటీలు ఎంపిక చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికలు నిర్వహించకుండా నేరుగా నాన్ ఆఫీషియల్ పద్ధతిలో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు మొత్తం ముగ్గురితో కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేసింది. ప్రస్తుతం ఉన్న సంఘాల పాలకవర్గం గడువు గత ఫిబ్రవరిలోనే ముగిసింది. కొన్ని చోట్ల పాలకవర్గాలను పొడగించగా.. ఆరోపణలు వచ్చిన వారిపై వేటు వేసి ప్రత్యేక అధికారులను నియమించింది. ఇటీవల పూర్తిగా రద్దు చేసి అన్ని చోట్ల ప్రత్యేక అధికారులను నియమించింది. ఈసారి ఎన్నికలు లేకుండా నేరుగా నామినేటెడ్ మాదిరి ఎంపిక చేసే అవకాశం ఉంది. జిల్లాలో 20 సహకార సంఘాలు ఉండగా.. మరో నాలుగు కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది. మొత్తంగా 23వేల మంది వరకు సభ్యులు ఉంటారు. ఇవేగాక ఉమ్మడి జిల్లా కేంద్రంగా పని చేస్తున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), అలాగే మార్కెటింగ్ పరిధిలో ఉన్న జిల్లా మార్కెటింగ్ సహకార సంఘ(డీసీఎంఎస్) పరిధిలోనూ చైర్మన్, సభ్యుల నియామకం చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ కొత్తగా జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్‌లు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లాకు కొత్తగా మరో నాలుగు కొత్త పీఏసీఎస్‌లు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.
పాతజీఎం కార్యాలయం ఆవరణలో శిథిల భవనం
మరమ్మతులకు నోచుకోని కార్యాలయ భవనం
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో సింగరేణి కంపెనీకి చెందిన ఆస్తులు తీవ్ర నిరాదరణ, నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఈ ప్రాంతంలో బొగ్గు గనులు మూతపడి, విభాగాలను ఇతర ప్రాంతాలకు, ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌కు తరలించిన తర్వాత కార్యకలాపాలు సద్దుమణిగాయి. శాంతిఖని గని, కంపెనీ క్వార్టర్లను మందమర్రి ఏరియాలో విలీనం చేసిన యాజమాన్యం కంపెనీ స్థిరాస్తులపై శ్రద్ధ చూపడం లేదు. సంరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. పాత జీఎం కార్యాలయం, ఏరియా ఆస్పత్రి, ఏరియా వర్క్‌షాప్ ప్రాంగణాల్లోని పలు విభాగాల విలువైన భవనాలు ఏళ్ల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోక ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. భవనం పైకప్పుకు రంధ్రాలు పడి అంతర్భాగం, గోడలు వానకు తడిసి, ఎండకు ఎండుతూ శిథిలమవుతున్నాయి. ఇదే అదునుగా గుర్తు తెలియని వ్యక్తులు కిటికీలు, దర్వాజాలు, ఇనుప సామగ్రి ఎత్తుకెళ్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న స్థిరాస్తులపై నిర్లక్ష్యం వహించడం వల్ల విలువైన భవనాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి.
సామగ్రి స్క్రాప్ దుకాణాలకు..
సింగరేణి కార్యకలాపాలు అంతిమ దశకు చేరుకు న్న రోజుల నుంచే ఇనుప సామగ్రి చోరీకి గురవ డం మొదలైంది. సింగరేణి ఎస్‌అండ్‌పీసీ, సీఐఎస్ ఎఫ్ జవాన్లు కాపలా ఉన్నా చోరీలు నిత్యకృత్యంగా మారాయి. వర్క్‌షాప్, పవర్‌హౌస్, స్టోర్ ప్రాంగణాల్లో ఉన్న రూ.లక్షలు విలువైన ఇనుప సామగ్రి దొంగల పాలయ్యాయి. అయినా అప్పటి అధికారులు కొందరు, ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది ‘మామూలు’గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న సామగ్రి అడపాదడపా స్క్రాప్ దుకాణాలకు చేరుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారులు పట్టింపు లేని ధోరణి ప్రదర్శిస్తున్నారు.
ఘనంగా క్రిస్మస్
ఘనంగా క్రిస్మస్
ఘనంగా క్రిస్మస్


