టీ–20 విజేత ఆదిలాబాద్
మంచిర్యాలటౌన్: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట్‌లో కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ–20 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌ను శనివారం నిర్వహించారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జట్లు ఫైనల్‌కు చేరగా టాస్ గెలిచిన ఆదిలాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసినట్లు కోచ్ ప్రదీప్ తెలిపారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మంచిర్యాల జిల్లా జట్టు 13.2 ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేసి 70 పరుగుల తేడాతో ఓటమి పాలైందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జట్టు నుంచి రాజబాబు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. విజేత, రన్నర్స్‌కి మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్, గుడిపేట్ బెటాలియన్ కమాండెంట్ కాళిదాసు బహుమతులు అందించారు.
దాడి చేసిన ఇద్దరిపై కేసు
దహెగాం: మండలంలోని చౌక గ్రామానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రగిరి లక్ష్మి, ఆమె భర్త రమేశ్‌పై శనివారం అదే గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు చంద్రగిరి శంకర్, శ్రావణ్ పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని రాడ్‌తో దాడి చేయడంతో గాయాలయ్యాయి. బాధితుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మెరకు కేసు నమోదుచేసిదర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
టీ–20 విజేత ఆదిలాబాద్


