విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
ఆదిలాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నూ రాణించాలని డీఎస్పీ జీవన్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం కాకతీయ యూనివర్సిటీ ఆదిలా బాద్ జోన్ (ఉమ్మడి జిల్లా) క్రికెట్ ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడారంగంలో రాణించిన వారికి గొప్ప భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే క్రీడలపై దృష్టి సారిస్తే గొప్ప క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిని అన్ని విధాలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటా లని పిలుపునిచ్చారు. పోటీల ఆర్గనైజర్ డీ సందీప్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఖమ్మం వేదికగా నిర్వహించనున్న ఇంటర్ జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు జనవరిలో 3నుంచి 5వరకు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్.శ్రీచరణ్ (కెప్టెన్), షేక్ అమాన్, ఎ.సాయికిరణ్ యాదవ్, సీహెచ్ పవన్‌కుమార్, సీహెచ్ వినయ్, ఎం.సుధీర్, జీ వంశీ, ఎం.ఆకాశ్, రాథోడ్ మిథల్‌రాజ్, కొట్నాక్ లక్ష్మణ్, టీ కార్తిక్, బీ సిద్ధార్థ, ఆర్ వివేక్, ఆర్ ఆకాశ్, ఎల్.కిరణ్, ఝెల్చల్వార్ సాయిప్రసాద్, స్టాండ్‌బై ఆటగాళ్లుగా డీ రవికిరణ్, ఎన్.నర్సింహ, కే పొల్లు ఎంపికై నట్లు తెలిపారు. డీటీఎస్వో పార్థసారథి, వాగ్దేవి కళాశాల చైర్మన్ బిలాల్, పీడీలు అనిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


