మానసికోల్లాసానికి క్రీడలు దోహదం
నస్పూర్: క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణ కాలనీలోని శాంతి సేడియంలో నిర్వహిస్తున్న కంపెనీ స్థాయి అథ్లెటిక్ పోటీలను జీఎం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించడమే కాకుండా జాతీ య స్థాయిలో మెడల్స్ సాధించాలని సూచించారు. రన్నింగ్, లాంగ్‌జంప్, త్రోస్, స్విమ్మింగ్ విభాగాలతో పాటు మహిళలకు త్రోబాల్, రన్నింగ్, త్రోస్, లాంగ్‌జంప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం ఎన్.సత్యనారాయణ, గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కొమురయ్య, అధికా రులు అనిల్‌కుమార్, శ్రీధర్, డాక్టర్ పీ రమేశ్‌బాబు, స్పోర్ట్స్ సెక్రటరీ సృజన్‌పాల్, సూపర్‌వైజర్లు అశోక్, జాన్‌వెస్లి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


