ఇళ్ల నిర్మాణాలకు అనుమతులివ్వాలి
ఆదిలాబాద్‌రూరల్: కోర్ ఏరియా పేరుతో ఆదివాసీ కొలాం తెగలకు చెందిన అర్హులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి వెంటనే అనుమతులివ్వాలని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించా లన్న అధికారులు, ప్రజాప్రతినిధుల ఆదేశాల మేర కు కొందరు గుడిసెలు తొలగించుకుని పునాదులు తవ్వుకున్నారని తెలిపారు. అయితే, అటవీశాఖ అధి కారులు నిర్మాణాలకు అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కూడా కలిసి తమ సమస్య విన్నవించినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్య క్తంజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్‌రావ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, గౌరవాధ్యక్షుడు టేకం లక్ష్మ ణ్, జైనథ్ మండలాధ్యక్షుడు కొడప రాము, నాయకుడు టేకం శ్యాంరావ్ తదితరులు పాల్గొన్నారు.


