నీతి ఆయోగ్ సేవలు భేష్
నార్నూర్: మండలంలో నీతి ఆయోగ్ సేవలు బాగున్నాయని నీతి ఆయోగ్ పరిశోధకుడు వి నయ్ ఐఐఎం తెలిపారు. మంగళవారం మండలంలోని జామ్‌డా, నార్నూర్ గ్రామాల్లో ఆ యన పర్యటించారు. నీతి ఆయోగ్ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జామ్ డా గ్రామంలో గ్రామస్తులతో ఏర్పా టు చేసిన సమావేశంలో పాల్గొని లాభాల గురించి తెలు సుకున్నారు. విద్య, వైద్యం, ఐసీడీఎస్ ద్వారా పిల్లల్లో వచ్చిన మార్పులపై ఆరా తీశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్ లర్నింగ్ కార్యక్రమాన్ని గమనించారు. నార్నూర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వెదురు వ స్తువులను పరిశీలించి వాటిపై వచ్చే లాభాల గురించి తెలుసుకున్నారు. అనంతరం నీతి ఆయోగ్ అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఆయన వెంట డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి మిల్కా, ఎంపీడీవో పుల్లారావు, సీడీపీవో శారద, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, సర్పంచ్ కావేరి, చందర్‌షావ్, రాయి సెంటర్ జిల్లా సార్‌మేడి మెస్రం దుర్గు పటేల్, మాజీ సర్పంచ్ మాడవి రూప్‌దేవ్ తదితరులున్నారు.


