హామీ ఇచ్చారు.. కోతులను పట్టించారు
తాండూర్: కోతుల బెడద నివారిస్తామని, కాంగ్రెస్ బలపరిచిన కుశ్నపల్లి లక్ష్మీనారాయణను మండలంలోని మాదారం సర్పంచ్‌గా గెలిపించాలని డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం ర వీందర్‌రెడ్డి ఎన్నికలకు ముందు గ్రామస్తుల కు హామీ ఇచ్చారు. నమ్మిన గ్రామస్తులు లక్ష్మీనారాయణను భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో రవీందర్‌రెడ్డితోపాటు సర్పంచ్‌గా గెలి చిన లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ సూరం దా మోదర్‌రెడ్డి తిరుపతికి చెందిన కోతులు పట్టే వారిని గ్రామానికి పిలిపించారు. వారంపాటు ఈ బృందం గ్రామంలోనే ఉండి కోతులను పూర్తి స్థాయిలో బంధించి దూరప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. మాదారంలో కోతుల బెడద నివారించినట్లుగానే మిగతా గ్రామాల్లోనూ ప్రజాప్రతినిధులు ఆ దిశగా చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.


