పవిత్ర గంగాజలం కోసం పాదయాత్ర
ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా మహాపూజకు అవసరమైన పవిత్ర గంగాజల సేకరణకు మెస్రం వంశీ యులు మంగళవారం పాదయాత్ర ప్రారంభించా రు. మహాపూజపై కటోడ మెస్రం హనుమంత్‌రావ్, పర్ధాన్ మెస్రం దాదారావ్ ప్రచారం ముగించుకుని కేస్లాపూర్‌కు చేరుకున్న విషయం తెలుసుకున్న ఉ మ్మడి జిల్లా మెస్రం వంశీయులు మంగళవారం మ ధ్యాహ్నం గ్రామంలోని నాగోబా మురాడి వద్ద స మావేశమయ్యారు. గంగాజల సేకరణ పాదయా త్ర, జాతర నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఝారి (కలసం) దేవతకు వంశీయులు, గ్రామ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం పవిత్రమై గంగాజల సేకరణ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశ అల్లుళ్లు, ఆడబిడ్డలు బూందో (కానుక) పట్ట గా పెద్దలు కానుకలు వేసి ముందుకుసాగారు. పాద యాత్రగా బయల్దేరి మొదటిరోజు కేస్లాగూడలో బ స చేశారు. ఈ నెల 31న మండలంలోని చిలటిగూ డ, జనవరి 1న నార్నూర్ మండలం మాన్కపూర్, 2న జైనూర్ మండలం మామడ, 3న డబోలి, 4న సిర్పూర్(యూ) మండలం దనోర, 5న జన్నారం మండలం ఇస్లాంపూర్, 6న దస్తురాబాద్ మండలం నర్సింగ్‌పూర్‌లో బస చేయనున్నారు. 7న గోదావరి నది హస్తిన మడుగుకు చేరుకుని ప్రత్యేకపూజలు ని ర్వహించి గంగాజలాన్ని సేకరించనున్నారు. తిరిగి పవిత్ర గంగాజలంతో బయల్దేరి 9న జైనూర్ మండలం కటోడ(పూజారి) మెస్రం హనుమంత్‌రావ్ గ్రా మమైన గౌరికి చేరుకుంటారు. గంగాజలాన్ని గ్రామ పొలిమేరలో భద్రపరిచి తమతమ గ్రామాలకు వెళ్లనున్నట్లు వారు తెలిపారు. జనవరి 14న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేరో జు సాయంత్రం గ్రామ సమీ పంలోగల మర్రి చెట్టు (వడ మర) వద్దకు చేరి బస చేయనున్నారు. మర్రి చెట్టు వద్ద జనవరి 15, 16, 17తేదీల్లో సంప్రదాయ, తూమ్(కర్మఖాండ) పూజలు చేయనున్నారు. పుష్యమాస అవమాస్యను పురస్కరించుకుని జనవరి 18 న రాత్రి 10.30 గంటల సమయంలో పవిత్ర గంగా జలంతో ఆలయాన్ని శుద్ధిచేస్తారు. అనంతరం మహాపూజ నిర్వహించి జాతర ప్రారంభిస్తారు.
భక్తిశ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించాలి
గంగాజలం సేకరణ పాదయాత్రలో పాల్గొన్న వంశీయులు నియమనిష్టలు, భక్తిశ్రద్ధలతో ఉండాలని, బడికి వెళ్లే విద్యార్థులు వద్దని, సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదని ఎప్పటిలాగే పెద్దలు నిర్ణయించారు. మంగళవారం కేస్లాపూర్ నాగోబా మురాడి వద్ద సమావేశమైన ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు గంగాజల సేకరణ యాత్రలో పాల్గొనేవారికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు చేశారు. మార్గమధ్యలో బస చేసి న గ్రామాల నుంచి బంధువుల ఇళ్లకు గాని లేదా ఇ తర ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. విద్యార్థులను తీసుకువచ్చి వారి చదువులకు ఆటంకం కలి గించవద్దని నిర్ణయించారు. వంశ పెద్దల నిర్ణయాలకు అందరూ కట్టుబడి నియమనిష్టలతో గంగా జల సేకరణ యాత్రతో పాటు నాగోబా పూజలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, సర్పంచ్ మెస్రం తుకారాం, వంశ పెద్దలు మెస్రం చిన్నుపటే ల్, బాదిరావ్, కోసేరావ్, ఆనంద్‌రావ్, వంశం పర్ధా న్ సమాజ్ పెద్ద మెస్రం దాదారావ్, వంశ ఉద్యోగులు మెస్రం సోనేరావ్, మెస్రం శేఖర్‌బాబు, మెస్రం దేవ్‌రావ్, మెస్రం కోసేరావ్ తదితరులున్నారు.
కరచాలనం చేసుకుంటున్న మెస్రం వంశీయులు
పెద్దలకు బూందో పడుతున్న అల్లుళ్లు, ఆడబిడ్డలు
పవిత్ర గంగాజలం కోసం పాదయాత్ర
పవిత్ర గంగాజలం కోసం పాదయాత్ర


