మళ్లీ యూరియా పాట్లు
వానాకాలం పంటలకు అవసరమైన యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. కొరత కారణంగా అదనుకు పంటలకు యూరియా వేయలేకపోయారు. దీంతో దిగుడిపై ప్రభావం చూపింది. తాజాగా యాసంగిలో మొక్కజొన్న సాగుచేసిన రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. పంటలకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా(కె) గ్రామంలో రైతులు శనివారం నిరసన తెలిపారు. గ్రామానికి 450 యూరియా బస్తాలు రాగా, రెట్టింపు సంఖ్యలో రైతులు పంపిణీ కేంద్రానికి వచ్చారు. చెప్పులను వరుసలో ఉంచి గంటల తరబడి నిరీక్షించారు. ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున 225 మంది రైతులకు మాత్రమే అధికారులు పంపిణీ చేశారు. ఓటీపీ విధానం ద్వారా కాకుండా వేలిముద్ర విధానం ద్వారా ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తాయి. విద్యార్థులు, రైతులు పట్టణాల్లో ఉండడంతో కౌలు రైతులకు సైతం యూరియా దొరకక ఇబ్బందులు ఎదురయ్యాయి. డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయాలని రైతులు అధికారులను కోరారు. – కుంటాల
మళ్లీ యూరియా పాట్లు


