ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి
జన్నారం: నేతకాని కుల సర్పంచులు గ్రామాలను ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ నేతకాని మహర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్‌నేత సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్పీఎన్ మైదానంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నేతకాని స ర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను నేతకాని కుల, విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసిన స న్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయిని ప్రసాద్‌నేత హాజరై వారిని సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బోర్లకుంట ప్రభుదాస్, జాడి శంకర్, జాడి గంగాధర్, రత్నం లక్ష్మణ్, జాడి వెంకట్, దుర్గం వినో ద్, అల్లూరి వినోద్, జునుగురి మల్లయ్య, సుధాకర్, నందయ్య రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


