అవుట్ సోర్సింగ్ లేబర్ యూనియన్ కమిటీ ఎన్నిక
శ్రీరాంపూర్: సింగరేణి కోల్‌మైన్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) శ్రీరాంపూర్ ఏరియా కమిటీ సమావేశం జరిగింది. శనివారం రసూల్‌పల్లెలో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బీ జనక్‌ప్రసాద్ నివాసంలో, ఆయన ఆధ్వర్యంలో ఏరియా కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏరియా అధ్యక్షుడిగా సిరిపురం రాజేశ్, ఉపాధ్యక్షులుగా ఆడెపు అశోక్, ఓదెలు, ప్రధాన కార్యదర్శిగా ఆవుల రమేశ్, సంయుక్త కార్యదర్శులుగా రాజేశ్, భాస్కర్, సహాయ కార్యదర్శులుగా రవి, రజనికుమార్, ప్రధాన ప్రచార కార్యదర్శిగా రాందేని శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా నరేశ్, అశోక్, తిరుపతి, సురేశ్, సందీప్, అశోక్, కోటేశ్, కోశాధికారిగా పున్నం కుమారస్వామిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న వారికి జనక్ ప్రసాద్ నియామక పత్రాలను అందించి యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. యూనియన్ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్‌రావు, కలవేని శ్యాం, గరిగే స్వామి, తిరుపతిరాజు, నాయకులు చిన్నయ్య, జీవన్‌జోయల్, జగన్‌స్వామి, అవుట్ సోర్సింగ్ లేబర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీంరవి పాల్గొన్నారు.


