పక్కా ఇళ్లు.. పలకాబలపం
ఆదివాసీలకు సకల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తాం నగర జీవన విధానాన్ని పరిచయం చేస్తాం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఆదివాసీ గూడాల్లో పక్కా ఇళ్లు నిర్మిస్తామని, పలక, బలపం అందించి సకల సౌకర్యాలు కల్పిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట గూడేన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎస్పీ అఖిల్ మహాజన్, మాజీ ఎంపీ సోయం బాపురావుతో కలిసి సందర్శించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. యువకులకు వాలీబాల్ కిట్లు అందించారు.
ఆధునిక ప్రపంచంతో మమేకం..
ఆదివాసీలను ఆధునిక ప్రపంచంతో మమేకం చే యాలని నిర్ణయించినట్లు తెలిపారు. మినీ కాశ్మీర్‌గా పిలువబడే ఆదిలాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తున్నా, అడవి బిడ్డలకు బయటి ప్రపంచం తెలియకపోవడం బాధాకరమన్నారు. కుమ్మరి కుంట గూడెం వాసులను ప్రత్యేక బస్సుల్లో హైదరా బాద్‌కు తీసుకెళ్తామన్నారు. నగరంలో చారిత్రక కట్టడాలు, వారసత్వ స్థలాలు, ఆకాశహర్‌ామ్యలు, మెట్రో రైళ్లు, నగర జీవనశైలిని చూపిస్తామని తెలి పారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలు చూసే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అడవికి ప రిమితం కాకుండా బయటి ప్రపంచాన్ని అనుభవించాలని సూచించారు. రవాణా, భోజన, వసతి ఖ ర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
జీవన ప్రమాణాల మెరుగుదలకు..
స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఆది వాసీ గూడేల్లో ఇప్పటికీ దుర్భర పరిస్థితులు ఉండ డం బాధాకరమన్నారు. దుప్పట్లు, క్రీడా సామగ్రికి రూ.50 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. పిల్లలను బడులకు పంపి గొప్పగా చదివించాలని, తల్లిదండ్రులు కనీసం సంతకం నేర్చుకోవాలని సూ చించారు. అక్షరాస్యత సాధించి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కుమురంభీం, రాంజీ గోండు వంటి మహానుభావులకు నిజమైన నివాళి అన్నా రు. చదువుకోవడానికి పలక, బలపం, ఇతర సౌకర్యాలు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రాథమిక సౌకర్యాలు, అభివృద్ధి హామీలు
కూడు, గూడు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అర్హ కుటుంబాలకు పక్కా ఇళ్లు ని ర్మిస్తామని, ఏజెన్సీ గూడేల్లో ఇళ్లు, రోడ్లు, విద్యుత్, వసతి సౌకర్యాల సమస్యలను ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రులతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. జ్ఞానంతో ప్రాంత అభివృద్ధి సాధించాలనిఆకాంక్షించారు. ప్రముఖులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు
పాల్గొన్నారు.


