ఆలయ హుండీ అపహరణ
కడెం: మండలంలోని మాసాయిపేట్ ఆంజనేయస్వామి ఆలయ హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం రాత్రి ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హుండీలో సుమారు రూ.2 వేల నగదు ఉందని గ్రామస్తులు తెలిపారు. ఆలయ సమీపంలో హుడీలోని నగదు తీసుకుని ఖాళీ హుండీని అక్కడే వదిలేసి వెళ్లారు. గురువారం ఉదయం గమనించిన గ్రామస్తులు.. చుట్టుపక్కల గాలించారు. ఖాళీ హుండీ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంచిర్యాల జిల్లా జట్టు విజయం
మంచిర్యాలటౌన్: కాకా మెమోరియల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌ను మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని గుడిపేట్‌లో గురువారం నిర్వహించారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మంచిర్యాల జట్టు మొదట బ్యాటింగ్ చేసి 18 ఓవర్లలో 140 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయిందని కోచ్ ప్రదీప్ తెలిపారు. ఆదిలాబాద్ జట్టు 18 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి ఓటమి పాలైందని, మంచిర్యాల జిల్లా జట్టు గెలుపొందిందని ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో 35 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన మంచిర్యాల జట్టు కెప్టెన్ జి.సాయికృపారెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేశారు.
ఆలయ హుండీ అపహరణ


