యూజీ అలవెన్స్ రికవరీ నిలిపివేయాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గనిలో కొందరు కార్మికులకు అండర్ గ్రౌండ్ అలవెన్స్ రికవరీ చేయడం నిలిపివేయాలని సీఐ టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ బ్రాంచ్ నాయకుడు కస్తూరి చంద్రశేఖ ర్ ఆధ్వర్యంలో శుక్రవారం గని షిఫ్ట్ ఇన్‌చార్జి, డిప్యూటీ మేనేజర్ సాత్విక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. గతంలో గని అవసరాల దృష్ట్యా అండర్ గ్రౌండ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను సర్ఫేస్‌లో పనులు చేయించారని తెలిపారు. నాడు కంపెనీ అవసరాల కోసం వారిని తీసుకున్నందున అండర్ గ్రౌండ్ అలవెన్స్ చెల్లించినట్లు చెప్పారు. చాలా నెలలు గడిచినా తరువాత నేడు నాటి చెల్లించిన అండర్ గ్రౌండ్ అలవెన్స్ తిరిగి రికవరీ చేయడానికి యాజమాన్యం లెట ర్లు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కంపెనీ అవసరాల కోసం కార్మికులతో పనిచేయించుకున్నాక వారి అవసరం తీరడంతో ఇచ్చిన అండర్ గ్రౌండ్ అలవెన్స్ తిరిగి వసూలు చేయడం సరికాద ని తెలిపారు. గుర్తింపు సంఘం వైఫల్యంతోనే అధి కారులు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ పిట్ సెక్రటరీ అరిగే సందీప్, నాయకులు శ్రీకాంత్, రాజయ్య, రమేశ్, ప్రతాప్, లింగమూర్తి, రవి పాల్గొన్నారు.


