కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక
శ్రీరాంపూర్: సీనియర్ కబడ్డీ జిల్లా జట్లను ఎంపిక చేశారు. కొద్ది రోజులుగా నస్పూర్‌లోని సాధన డిఫెన్స్ అకాడమీ వద్ద ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నారు. గురువారం జట్లను ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ నెల 28 వరకు కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్డేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్, కార్యదర్శి కార్తిక్, కార్యవర్గ సభ్యుడు రవీందర్ తెలిపారు.
పురుషుల జట్టు
దీపక్(వెంకట్రావుపేట), పీ.విజయ్(బూరుగుపల్లి), ఆర్.దినకర్(వెంకట్రావుపేట), ఏ.మహేశ్(వెంకట్రావుపేట), ఎం.పవన్(రాజంపేట), ఏ.సాయికృష్ణ(దొరిగారి పల్లె), ఎం.శివాజీ(నర్సింగపూర్), ఎం.సంజయ్(దుగ్గినపల్లి), ఎం.జాన్సన్(కొత్తపల్లి), ఎస్.శ్రావణ్(నరసింగాపురం), ఏ.అరవింద్(కొత్తకొమ్ముగూడెం), పీ.వెంకటేశ్(సుద్దాల), ఎండీ.అక్రం(శ్రీరాంపూర్), జే.శ్రీనాథ్(కన్నెపల్లి) ఎంపికయ్యారు. కోచ్‌గా బీ.రవికుమార్, మేనేజర్‌గా పవన్‌కుమార్ వ్యవహరిస్తారు.
మహిళల జట్టు..
ఏ.మౌనిక(చెన్నూరు), ఎన్.ఐశ్వర్య(జైపూర్), డీ.సంఘవి(నస్పూర్), ఆర్.ఆకాంక్ష(శ్రీరాంపూర్), జే.అఖిల(రామకృష్ణపూర్), సీహెచ్.రక్షిత(రామకృష్ణపూర్), ఎం.శృతి(మైలారం), ఏ.మానస(కొండాపూర్), జే.పావని(కావాలి), సీహెచ్.హారిక(పారుపల్లి), కే.తులసి(బోడుపల్లి), ఏ.ఆశ్రిత(నెన్నెల), స్పందన(జైపూర్), బీ.రాఘవర్ధిని(ఐబీ తాండూర్) ఎంపికయ్యారు. కోచ్‌గా వీ.సందానంద, మేనేజర్‌గా కిషన్ వ్యవహరిస్తారు.


