క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కల్యాణ్
భీమారం: హైదరాబాద్ డి సేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26నుంచి 28వరకు ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన ఉస్కమల్ల కల్యాణ్ ఎంపియ్యారు. ఈమేరకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది డిసేబుల్డ్ నుంచి కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు కల్యాణ్ మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి కెప్టెన్‌గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కొత్త వ్యూహాలతో క్రికెట్ ఆడి రాష్ట్రానికి పేరు సాధిస్తానని తెలిపారు. రాబోయే జోనల్, నేషనల్ పోటీల్లో హైదరాబాద్ టీంను విజయపథంలోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈమేరకు టీంకు కోచ్ చంద్రభాన్‌గిరి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.


