ఏఐయూ పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థినులు
బాసర: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూ నివర్సిటీస్(ఏఐయూ) జాతీయస్థాయిలో ని ర్వహించే బాస్కెట్ బాల్ పోటీలకు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థినులు ఎంపికయ్యారు. ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించిన బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులు జాతీయస్థాయికి అర్హత సాధించారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు బెంగళూరులోని క్రిస్ట్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే పోటీల్లో బా సర ట్రిపుల్ ఐటీ విద్యార్థినులు పాల్గొంటారు. జాతీయ పోటీలకు ఎంపికై న 11 మందితో కూడిన క్రీడాకారుల జట్టుకు ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ శుక్రవారం స్పోర్ట్స్ యూని ఫాం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఎస్.విఠల్, ఎస్.శేఖర్, దిల్ బహార్, కాశన్న, శ్యామ్‌బాబు, నాగలక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.


