దుప్పట్లు అందించి..చలి ఇక్కట్లు తీర్చి
దండేపల్లి: చలి తీవ్రత దృష్ట్యా దండేపల్లి గ్రామానికి చెందిన పలువురు నిరుపేద వృద్ధులకు చలి ఇక్కట్లు తీర్చేందుకు దండేపల్లి ఎస్సై తహాసీనొద్దీన్ గురువారం దుప్పట్లు అందించి మానవత దృక్పథాన్ని చాటుకున్నారు. చలి తీవ్రతతో వృద్ధుల ఇబ్బందులను గుర్తించి దుప్పట్లు అందించినట్లు పేర్కొన్నారు. మండలంలోని మేదరిపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు దుప్పట్లు అందించారు. లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గడ్డం రాంచందర్, కోశాధికారి రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లి కార్జున్ పాల్గొన్నారు.


