అనుమతి లేకుండా హాస్టల్ బయటకు విద్యార్థులు
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని బీసీ సమీకృత హాస్టల్ నుంచి అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్లి రెండుగంటల తర్వాత తిరిగి వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతిగృహంలో చదివే ఎనిమిదిమంది విద్యార్థులు శుక్రవా రం రాత్రి 8గంటల సమయంలో సినిమా చూసేందుకు వాచ్‌మెన్‌కు చెప్పకుండా గోడదూకి వెళ్లిపోయారు. విద్యార్థులు కనబడకుండా పోయిన విషయాన్ని డ్యూటీ వాచ్‌మెన్ వార్డెన్‌కు సమాచారం అందించగా అతిడిని వెంటనే అలర్ట్ చేసి ఎక్కడున్నారో తెలుసుకోవాలంటూ పురామయించారు. విద్యార్థుల కోసం వెతుకుతున్న క్రమంలోనే సిని మా థియేటర్‌కు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరికి తెలిసిన వ్యక్తి కనిపించగా అతడు వెంటనే దాదాపు 9గంటల ప్రాంతంలో తిరిగి హాస్టల్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు అధికా రులకు ఫిర్యాదు చేయటంతో శనివారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి హాస్టల్‌లో తల్లిదండ్రుల సమక్షంలో విచారణ చేపట్టగా తామే అనుమతి లేకుండా గోడదూకి బయటకు వెళ్లినట్లు విద్యార్థులు అంగీకరించారు.
ఖాళీలతో పర్యవేక్షణ ఎలా?
స్థానిక బీసీ సమీకృత వసతిగృహంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన 185 మంది విద్యార్థులు చదువుతున్నారు. వసతిగృహ పర్యవేక్షణకు ముగ్గు రు వార్డెన్లు, ముగ్గురు వాచ్‌మెన్లు, ఆరుగురు ఉద్యోగులు (వంట మనుషులు) పనిచేయాల్సి ఉండగా.. ఒక్కరే రెగ్యులర్ ఎస్టీ వంట ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో వసతిగృహ పర్యవేక్షకుడు (బీసీ వార్డెన్) ఇటీవలే విద్యార్థులకు చాలీచాలని భోజనం పెట్టడం.. అధికారుల విచారణలో నిర్ధారణ కావటంతో సరరెండర్ చేశారు. ఎస్టీ వార్డెన్‌ను జ న్నారానికి డిప్యుటేషన్ ఇచ్చారు. దీంతో ఎస్సీ వార్డెన్ మాత్రమే అన్నీ తానై నెట్టుకొస్తున్నారు. ముగ్గురు వాచ్‌మెన్లలో ఎస్టీ వాచ్‌మెన్‌ను సిర్పూర్ ఎస్టీ హాస్టల్‌కు వార్డెన్‌గా డిప్యుటేషన్ చేశారు. హాస్టల్ పర్యవేక్షణపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితం కావటంతో సిర్పూర్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఎస్టీ వాచ్‌మెన్‌ను తిరిగి బీసీ సమీకృత వసతిగృహానికి కేటాయించారు. ఇంతలోనే విద్యార్థులు బయటకు గోడదూకి పారిపోవటం చర్చనీయాంశంగా మారింది. బీసీ వసతిగృహ వార్డెన్‌తో పాటు డిప్యుటేషన్‌పై వెళ్లిన ఎస్టీ వార్డెన్‌ను వెంటనే తిరిగి వసతిగృహానికి కేటాయిస్తే పర్యవేక్షణ మెరుగుకానుంది.
పూర్తిస్థాయి వార్డెన్లను నియమించాలి
సాయికుంట బీసీ సమీకృత హాస్టల్‌లో ఖాళీగా ఉన్న వార్డెన్లు, వాచెమన్ పోస్టులతో పాటు వంట ఉద్యోగుల పోస్టుల భర్తీ చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి భాగ్యవతికి వినతిపత్రం అందజేశారు. వసతిగృహంలో వార్డెన్లు, సిబ్బంది కొరతతో పర్యవేక్షణ కొరవడుతోందని తెలిపారు. జన్నారానికి డిప్యుటేషన్‌పై వెళ్లిన రెగ్యులర్ ఎస్టీ వార్డెన్‌ను తిరిగి ఇదే హాస్టల్‌కు కేటాయించాలని కోరారు. పూర్తిస్థాయిలో వార్డెన్లు, వాచ్‌మెన్, వంట కార్మికులను వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేశారు. పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఏఐఎస్‌బీ జిల్లా కార్యదర్శి సన్నీగౌడ్, యూఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


