మిల్లర్‌లో పడి తెగిన కూలీ చేయి
జన్నారం: ఇంటి స్లాబ్ నిర్మాణ పనికి వెళ్లిన ఓ కూలీ చేయి ప్రమాదవశాత్తు మిల్లర్‌లో పడి తెగిన ఘటన మండలంలోని కామన్‌పల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామన్‌పల్లి గొండుగూడకు చెందిన కు మరం మహేశ్ ఆదివా రం గ్రామంలో ఇంటి స్లాబ్ వేయడానికి మేసీ్త్ర కింద కూలీ పనికి వెళ్లా డు. కంకర, ఇసుక వేసే క్రమంలో ప్రమాదవశాత్తు అతడి చేయి మిల్లర్‌లో పడి మణికట్టు వరకు తెగిపోయింది. వెంటనే 108కు సమాచా రం ఇవ్వడంతో ఈఎంటీ రమేశ్, పైలట్ రఫీక్ అక్కడికి చేరుకుని మహేశ్‌కు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అంబులెన్స్‌లో లక్సెట్టిపేట ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


