రైతుల పక్షపాతి పీఎస్సార్
దండేపల్లి: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు రైతుల పక్షపాతి అని రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి పేర్కొన్నారు. మండలంలోని గూడెం, గుడిరేవు, ద్వారక గ్రామాలకు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించినందుకు హర్షం వ్యక్తం చేశారు. మేదరిపేట బస్టాండ్ వద్ద శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రేంసాగర్‌రావు ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి మంచి ర్యాల నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా చూస్తున్నారని పేర్కొన్నా రు. పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అక్క ల వెంకటేశ్వర్లు, కంది సతీశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


