ఏసీబీ వలలో సర్వేయర్
నిర్మల్ రూరల్: మండల సర్వేయర్, అతని ప్రైవేట్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన నాంపల్లి బాలకృష్ణవర్మ నిర్మల్ అర్బన్ మండల సర్వేయర్‌గా ప నిచేస్తూ రూరల్ మండలానికీ ఇన్‌చార్జీగా వ్యవహరి స్తున్నారు. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన మేకల చిన్నయ్య ఎల్లపల్లి గ్రామంలోని తన భూమిని సర్వే చేయాలని బాలకృష్ణవర్మను సంప్రదించాడు. ఇందుకు సదరు సర్వేయర్ రూ.15వేలు డిమాండ్ చేశారు. ఇందులో రూ.5వేలు ముందే చె ల్లించాడు. మిగతా రూ.10వేల నుంచి రూ.7,500 నగదు జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం బాలకృష్ణ, అసిస్టెంట్ నాగరాజుకు చిన్నయ్య ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం నిందితులను రూరల్ తహసీల్దార్ కా ర్యాలయానికి తరలించి పంచనామా నిర్వహించా రు. లంచం తీసుకుంటూ పట్టుబడిన బాలకృష్ణ, అ తని అసిస్టెంట్ నాగరాజును కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.


