రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: మాస్టర్ అథ్లెటిక్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మంచిర్యాల డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ సెక్యూరిటీ ఉద్యోగి తిరుపతి ప్రతిభ కనబరిచారు. ట్రిపుల్ జంప్ (9.32 మీటర్లు)లో ద్వితీయస్థానం సాధించారు. 400 మీటర్ల పరుగు పందెంలో తృతీయస్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసపత్రం అందుకున్నారు. జనవరి చివరి వారంలో రాజస్థాన్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొనున్నాడు. తిరుపతిని డీఎం శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు అభినందించారు.


