అవిశ్రాంతంగా శ్రమిస్తా
చెన్నూర్: గత ఏడాది గ్రూప్–3, పంచాయతీ సెక్రెటరీలకు ప్రయత్నం చేశా. గ్రూప్–3 కొంచెంలో మిస్సయింది. పంచాయతీ సెక్రెటరీ 1ః2 ఉన్నాం. పంచాయతీ సెక్రెటరీ వస్తుందని నమ్మకం ఉంది. వచ్చినా రాకున్నా పోయినేడాది పరీక్షలు రాసిన అనుభవంతో గ్రూప్స్ సాధించి తీరుతా. కొత్త సంవత్సరం 2026లో నా లక్ష్యాన్ని సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తా.
– చెన్నూరి రాజేశ్, ఎంఏ, ఎంఎస్సీ, బీఎడ్,
ఎల్‌ఎల్‌బీ, చెన్నూర్
తల్లిదండ్రుల కోరిక నెరవేరుస్తా
బెల్లంపల్లి: గతేడాది డిగ్రీ(బీకాం) పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని చదివి సాధించాను. చాలా సంతోషం కలిగింది. ఈ ఏడాది నా తల్లిదండ్రుల కోరిక నెరవేర్చాలని బలంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాను. పీజీ ఫస్టియర్ చదువుతూనే గ్రూప్–1 ప్రిపేర్ అవుతున్నాను. ఎంతకష్టమైన సరే పరీక్ష రాసి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కోరిక నెరవేరుస్తా.
– బి.జ్ఞానేష్, పీజీ విద్యార్థి
అవిశ్రాంతంగా శ్రమిస్తా


