గ్రామాల అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు ● సర్పంచులకు సన్మానం
మంచిర్యాలటౌన్: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. బుధవారం స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో మంచిర్యాల నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలంలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, దేవాపూర్ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్‌రావు, నాయకులు పాల్గొన్నారు.
రైతులకు రూ.46 లక్షలు అందజేత
దండేపల్లి మండలానికి చెందిన పలువురు రైతులు ఓ వ్యాపారి చేసిన ఆర్థిక మోసంపై ఎమ్మెల్యేను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. బుధవారం 70 మంది బాధిత రైతులకు రూ.46 లక్షలు సదరు వ్యాపారి వద్ద నుంచి వసూలు చేసి అందజేశారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్ చెక్కులు అందజేశారు. తహసీల్దార్లు రఫతుల్లా హుస్సేన్, శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు.


