పనులు పూర్తి చేయడమే లక్ష్యం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వనివీ నెరవేర్చుతున్నా. పనులన్నీ ఈ సంవత్సరంలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. కొత్తగా నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రూ.74.40 కోట్లతో మంజూరు కాగా, టెండరు ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభిస్తాం. మంచిర్యాల మార్కెట్‌లో రోడ్ల వెడల్పును రూ.78 కోట్లు, రాళ్లవాగు వరద రాకుండా కరకట్ట నిర్మాణం రూ.255 కోట్లతో చేపడుతున్నాం. కాలేజీరోడ్డులో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందిస్తా. ఇండస్ట్రీయల్ పార్కు, ఐటీ హబ్ పనులు పూర్తి చేస్తాను. – కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే


