మంచిర్యాలలో చోరీ
● నాలుగు తులాల బంగారం, 10 తులాల వెండి అపహరణ
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని వికాస్‌నగర్‌లో ఈ నెల 23న రాత్రి చోరీ జరిగినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న వికాస్‌నగర్‌లో ని వాసముంటున్న రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇ ల్లందుల సమ్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాడు. 25న ఉదయం ఇంటికి రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో దాచి న నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మహిళను దూషించిన
కేసులో ఒకరి రిమాండ్
కౌటాల: మహిళను అసభ్య పదజాలంతో దూషించడం, ఆమె చేతిని పట్టుకుని బలవంతంగా లాగిన కేసులో కౌటాల మండలం తలోడి గ్రామానికి సిద్దల బాపుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై డి.చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన డోకె శకుంతల 18 ఏళ్ల క్రితం డబ్బా బుచ్చయ్య వద్ద నుంచి నాగేపల్లి శివారులో 30 గుంటల భూమిని కొనుగోలు చేసిందన్నారు. బుచ్చయ్య మృతి చెందడంతో ఇటీవల ఆయన భార్య లింగక్క, కోడలు డబ్బా పోశక్క భూమి తమదే అంటూ శంకుంతల భూమిలోకి అక్రమంగా ప్రవేశించి రూ.15 వేల విలువైన వరి పంటను కోసి దొంగలించారని పేర్కొన్నారు. ఈ ఘటనలో సిద్దల బాపు డబ్బా బుచ్చయ్య కుటుంబీకులకు రెచ్చగొట్టడంతో పాటు శకుంతలను అసభ్య పదజాలంతో దూషించినట్లు విచారణలో వెల్లడైనట్లు ఎస్సై తెలిపారు. ఈ నెల 23న బాధితురాలు ఫిర్యాదు మేరకు సిద్దల బాపు, డబ్బా పోశక్క, డబ్బా లింగక్కపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాపును అరెస్ట్ చేసి సిర్పూర్ కోర్టులో హాజరుపర్చామన్నారు. న్యాయమూర్తి అజయ్‌కుమార్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా, ఆసిఫాబాద్ జైలుకు తరలించామన్నారు. డబ్బా పోశక్క, లింగక్కను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్సై తెలిపారు.


