ఆర్థిక ఇబ్బందులతో పాస్టర్ బలవన్మరణం
నస్పూర్: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు బలవన్మరణం చెందిన ఘటన సీసీసీ న స్పూర్ పోలీస్‌స్టేషన్ పరి ధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్‌రావు తెలి పిన వివరాల మేరకు సీసీ సీలోని సుందరయ్య కాలనీకి చెందిన సుందరగిరి శ్రీధర్(45) స్థానిక హోలి మినిస్ట్రీస్ చర్చిలో పాస్టర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గతనెల 31 న ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాలేదు. బంగ్లాస్ ఏరియాలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో అతని ద్విచక్ర వాహనం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించగా చికిత్స పొందుతూ 31న రాత్రి మృతి చెందాడు. మృతుని కుమారుడు చరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


