పొట్టకూటి కోసం వచ్చి మృత్యు ఒడికి
ఉట్నూర్‌రూరల్: కుటుంబ పోషణ నిమిత్తం లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ ఆంధ్రా నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్న లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన ఉట్నూర్‌లో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గణపవరం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ ఆరేటి సత్యనారాయణ(47)బుధవారం పాలకొల్లు గ్రామం నుంచి లారీలో కొబ్బరికాయల లోడ్ వేసుకుని ఆదిలాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉట్నూర్‌కు చేరుకుని లారీని ప్రధాన రదారి పక్కన నిలిపాడు. లోడ్‌తో ఉన్న లారీ తాడు సరిచేస్తున్నా డు. ఈ క్రమంలో ఒక్కసారి గా కింద పడిపోయా డు. గమనించిన స్థానికులు సత్యానరాయణకు సీపీఆర్ చేసి ఉ ట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించా రు. లారీ నడుపుతున్నపుడు గుండెపోటు వస్తే ప్ర మాదం మరోలా ఉండేదని స్థానికులు పేర్కొన్నా రు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


