అగ్ని ప్రమాదంలో దుకాణం దగ్ధం
ఉట్నూర్‌రూరల్: మండలంలోని లింగోజీ తండా ఎక్స్‌రోడ్డు గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దుకాణం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కాగూడ గ్రామానికి చెందిన లక్కకుల తిరుపతి గది అద్దెకు తీసుకుని మక్కలు కాల్చుకుని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి మిగిలిన మక్కలు దుకాణంలో ఉంచి ఇంటికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి దుకాణంలో మంటలు చెలరేగాయి. మక్కలు కాలిపోవడంతో పాటు సామగ్రి దగ్ధమైంది. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.20లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని స్థానిక ఉప సర్పంచ్ హరిచంద్ బాధితుడికి భరోసా కల్పించారు.


