‘ఉద్యోగం పేరిట మోసం’
జన్నారం: కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని పొనకల్‌కు చెందిన నందాల ప్రదీప్ కోరాడు. ఈ మేరకు రామగుండం పోలీసులు, సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వి లేకరులతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం జన్నారంలో ఉంటున్న జీ.సృజన్ క్రెడిట్ కా ర్డుల ద్వారా రూ.5.80 లక్షలు తీసుకున్నాడ ని, ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో నెలకు రూ.50 వేల చొప్పున ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నానని పేర్కొన్నా డు. డబ్బుల విషయంలో నిలదీస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని, పో లీసులు న్యాయం చేయాలని కోరాడు.
చికిత్స పొందుతూ
యువకుడు మృతి
ఖానాపూర్: గత నెల 28 న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని బావాపూర్(కే) గ్రామానికి చెందిన నేరెళ్ల వెంకటేశ్ (25) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. మెట్‌పల్లి ఆర్టీసీ డిపోలో ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్ గత నెల 28న మద్యం మత్తులో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని తండ్రి గంగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
సంప్రదాయాలు భావితరాలకు అందించాలి
ఇంద్రవెల్లి: ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైఉందని జై జంగో జై లింగో జంగామ్ దేవస్థానం పీఠాధిపతి కుమ్ర భగవంత్‌రావ్ అన్నారు. గురువారం మండలంలోని తుమ్మగూడలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్యమాసం ఆదివాసీలకు ఎంతో పవిత్రమైందన్నారు. జంగుబాయి భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తుందని ఆదివాసీల నమ్మకమని, ప్రతిఒక్కరూ జై జంగో జై లింగును ఆరాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ సోయం మాన్కు, సర్పంచ్ విజయలక్ష్మి, కొరెంగా యేశ్వంత్‌రావ్, సురేష్ మహారాజ్, పెందోర్ అర్జున్, మోహపత్‌రావ్, విషంరావ్, పుర్క బాపురావ్, పెందోర్ పుష్పరాణి, తదితరులు పాల్గొన్నారు.
‘ఉద్యోగం పేరిట మోసం’


