అప్పుల బాధతో వార్డు సభ్యుడి ఆత్మహత్య
దిలావర్‌పూర్: ఇంటి నిర్మా ణం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంలో ఇటీవల వార్డు సభ్యుడిగా ఎన్నికై న యువకుడు ఆ త్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం కాల్వ గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడ్డాల నరేశ్(31) తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. వీడీసీలో రైటర్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏడో వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు. సోమవారం పంచాయతీ పాలకవర్గంతో కలిసి ప్రమాణస్వీకారం చేశాడు. అయితే ఇంటి నిర్మాణం కోసం అప్పులు కావడంతో వాటిని ఎలా తీర్చాలని కొంతకాలంగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరివేసుకున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చూసి బోరున విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నరేశ్ మృతికి సర్పంచ్ రోజా, మాజీ సర్పంచులు ఇప్ప నర్సారెడ్డి, ఆడెపు తిరుమల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ నిమ్మల చిన్నయ్య సంతాపం తెలిపారు.


