వార్షిక లక్ష్యం సాధించాలి
జైపూర్: ఐకే–ఓసీపీలో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశిత 15లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను తప్పనిసరిగా సాఽధించాలని సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర్లు సూ చించారు. జైపూర్ మండలం ఇందారం ఐకే–ఓసీపీ ప్రాజెక్టును శనివారం డైరెక్టర్ వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు అధికారులు ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకెళ్లాలని తెలిపారు. ఉపరితల గనులకు కావాల్సిన యంత్రాలు, సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. వరాహా వోబీ కాంట్రాక్టు కంపెనీ ప్రతినెలా వోబీ 20.185లక్షల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. ఇందుకు కావాల్సిన అన్నింటినీ సమకూర్చుకుని రక్షణ నియమాలను పాటిస్తూ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను రక్షణతో సాధించాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుని ముందుకువెళ్లాలని తెలిపారు. ఇందుకు ప్రతీ ఉ ద్యోగి కృషి చేయాలని సూచించారు. ఐకే–ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, గని మేనేజర్లు నా గన్న, శంకర్, రక్షణాధికారి లక్కకుల మహేశ్, వరా హా కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
లక్ష సాధనకు కృషి చేయాలి


