విద్యుత్ తీగలు మార్చాలి
తీగల్‌పహాడ్‌లోని సర్వేనంబరు 15లో ఉన్న మా వ్యవసాయ భూమిలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరాయి. తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. మార్చాలని పలుమార్లు విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా పని చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి సవరించాలి.
– సిలువేరి మధుకర్, తీగల్‌పహడ్, నస్పూర్
ప్లాట్లు.. పరిహారం ఇవ్వలేదు..
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన చందనపూర్ గ్రామస్తులకు పునరావాసం కింద 280 ప్లాట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 230 పాట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా 50 ప్లాట్లు ఇవ్వలేదు. పరిహారం కింద రూ.3.75లక్షల ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు ప్లాట్లు, పరిహారం ఇవ్వలేదు. ఏళ్ల తరబడిగా తిరుగుతున్నాం. – చందనపూర్ భూ నిర్వాసితులు
విద్యుత్ తీగలు మార్చాలి


