పరిమితికి మించి.. ప్రమాదం అంచున..
పరిమితికి మించి లగేజీతో వస్తున్న ట్రావెల్స్ బస్సులు
ఆదిలాబాద్–హైదరాబాద్ మధ్య నడిచే జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ప్యాసింజర్లను మాత్రమే తరలించాల్సిన ట్రావెల్స్ బస్సులు గూడ్స్ వాహనాలను మరిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా లగేజీని తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల రెండు ప్రమాదాలు చోటు చేసుకోగా మరణాలూ సంభవించాయి. వీటిని రవాణాశాఖ అధికారులు కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
పరిమితికి మించి.. ప్రమాదం అంచున..


