భీమిని ఠాణా తనిఖీ
భీమిని: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. వర్టికల్ వారీగా సిబ్బంది పనితీ రు తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మ ర్యాదగా వ్యవహరిస్తూ కేసులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధి లోని ప్రతీ గ్రామాన్ని సందర్శించాలని, గ్రామాల్లోని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి ముందస్తు సమాచారం సేకరించి నేరాలు జరగకుండా చూడాలని తెలిపారు. ‘100 డయల్’కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. తాండూర్ సీఐ దేవయ్య, సిబ్బంది ఉన్నారు.


