‘కడెం’కు సందర్శకుల తాకిడి
కడెం: కడెం ప్రాజెక్ట్ వద్ద ఆదివారం సందర్శకుల సందడి కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రాజెక్ట్ అందాలను తిలకించి బోటులో విహరించారు.
ముగిసిన ఎన్‌ఎస్‌ఎస్ అడ్వంచర్ క్యాంప్
బాసర: అటల్ బిహారీ వాజపేయి మౌంటెనీరింగ్, అల్లాయిడ్ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని పోంగ్‌డామ్‌లో ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ అడ్వంచర్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. శిబిరంలో బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు ప్రవళిక, బి.వీరమల్లేశ్వర్, కే.సాయిరాహుల్, ఎన్.శివాంశ, ఎమ్.స్వాతి, ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు. శిబిరం ముగించుకుని వచ్చిన విద్యార్థి బృందానికి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ ఆదివారం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ టి.రాకేష్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
కేకే ఓసీని సందర్శించిన డైరెక్టర్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే ఓసీని సింగరేణి డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్లు ఆదివారం ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ఓసీలోని పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు తగిన సూచనలు చేశారు. పాలచెట్టు ఏరియాలోని సోలార్ విద్యుత్ ప్లాంట్ ఆవరణలో ఇటీవల ఏర్పాటు చేసిన బ్యాటరీ స్టోరేజ్ సిస్టంను పరిశీలించారు. ఆయన వెంట కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, మేనేజర్ రామరాజు తదితరులున్నారు.
‘కడెం’కు సందర్శకుల తాకిడి
‘కడెం’కు సందర్శకుల తాకిడి


