హోరాహోరీగా టీ20 క్రికెట్ పోటీలు
మంచిర్యాలటౌన్: కాకా మెమోరియల్ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా మంచిర్యాల నగర పరిధిలోని గుడిపేట్‌లో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. శుక్రవారం కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా జట్ల మధ్య మ్యాచ్‌లో జరిగాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయగా 19.2 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయినట్లు కోచ్ పోరండ్ల ప్రదీప్ తెలిపారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జిల్లా జట్టు 15.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బ్యాట్స్‌మెన్ అస్ఫాన్ 49 బంతుల్లో 64 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. అనంతరం మంచిర్యాల, నిర్మల్ జిల్లా జట్లు తలపడగా, మంచిర్యాల జిల్లా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 18 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేయగా, నిర్మల్ జిల్లా జట్టు 14 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. మంచిర్యాల జిల్లా జట్టు ఫైనల్‌కు చేరింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను మంచిర్యాల జిల్లా జట్టుకు చెందిన ఇస్మాయిల్ పొందారు. 15 బంతుల్లో 39 పరుగులతో పాటు, బౌలింగ్‌లో 5 వికెట్లు తీశారు. శుక్రవారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి టాస్ వేసి ప్రారంభించారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్మాయిల్
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అస్ఫాన్
హోరాహోరీగా టీ20 క్రికెట్ పోటీలు


