లోక కల్యాణార్థం వీహెచ్‌పీ పాదయాత్ర
మంచిర్యాలటౌన్: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో గురువారం హిందూ ధర్మ పరిరక్షణ, లోక కల్యాణార్థం జిల్లా కేంద్రంలోని దుర్గామాత ఆలయం నుంచి రాపల్లిలోని బుగ్గగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి వేముల రమేశ్ మాట్లాడుతూ హిందువులంతా సంఘటితం కావాల ని, కులాలు, వర్గాలు, రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని కోరారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటం చేస్తూ పాదయా త్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశ్వంభరస్వామి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు రాజలింగు, ఉపాధ్యక్షురాలు కనకతార, నగర కార్యదర్శి రాజేశ్, ఉపాధ్యక్షులు సంపత్ పాల్గొన్నారు.


