ప్రజా సంక్షేమానికి పెద్దపీట
జైపూర్: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర కార్మిక, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మకాలనీలో రూ.25లక్షలతో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ భవన నిర్మాణానికి మంత్రి వివేక్ కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో సోలార్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. నర్సరీని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రూ.20లక్షలతో ఇందిరా మహిళా భవన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్ కూన భాస్కర్, ఉప సర్పంచ్ ఇరిగిరాల శ్రావణ్, నాయకులు అంబల్ల సంపత్‌రెడ్డి, మంతెన లక్ష్మణ్, అంబల్ల రవి, గద్దల అనిల్ పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్
ఆడబిడ్డలకు వరం
చెన్నూర్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ నిరుపేద ఆడబిడ్డలకు వరమని మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి అందజేశారు. మంత్రి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కరికీ ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని, కమీషన్ల కోసం తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి
చెన్నూర్: అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ఏసుక్రీస్తు ప్రబోధించారని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం స్థానిక ఐఈఎం చర్చిలో మంత్రి, కలెక్టర్ పాల్గొని కేక్ కట్ చేశారు. తహసీల్దార్ మల్లికార్జున్, ఫాస్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి పెద్దపీట


