రోడ్డు ప్రమాదంలో ఎస్పీఎం కాంట్రాక్టు కార్మికుడు మృతి
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణం కాపువాడలోని శ్రీపంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్పీఎం కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. ఆసిఫాబాద్ మండలం ఈదులవాడకు చెందిన షేక్‌బాబా(50)కు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సలీం ఉన్నారు. కుమార్తెలకు వివాహం కావడంతో కుమారుడితో కలిసి కాగజ్‌నగర్ పట్టణం కాపువాడలోని అత్తగారింట్లో ఉంటున్నాడు. రెండేళ్లుగా ఎస్పీఎం కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా శ్రీపంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో వెనుక వైపు నుంచి షేక్ అక్బర్ బైక్‌తో బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. షేక్ బాబాకు తీవ్రగాయాలై రక్తస్రావంతో అక్కడిక్కడే మృతి చెందాడు. షేక్ అక్బర్‌కు సైతం తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటన స్థలాన్ని పట్టణ ఎస్సై సుధాకర్ సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఎస్పీఎం కాంట్రాక్టు కార్మికుడు మృతి


